Tuneega Tuneega Song Lyrics||Manasantha Nuvve

Tuneega Tuneega Song is from the movie Manasantha Nuvve sung by Usha, Sanjeevini.Lyrics written by Sirivennela Seetharama Sastry and music composed by R.P Patnaik.


(Music)

తూనీగా తూనీగా
ఎందాక పరిగెడతావే 
రావే నా వంకా...

దూరంగా పోనీక 
ఉంటాగా నీ వెనకాలే 
రాని సాయంగా...

ఆ వంక ఈ వంక 
తిరిగావే ఎంచక్కా 
ఇంకా నా చాలింకా 
ఇంతేగా నీ రెక్కా 
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా...

తూనీగా తూనీగా 
ఎందాక పరిగెడతావే 
రావే నా వంకా...

(Music)

దోసిట్లో ఒక్కో చుక్క 
పోగేసి ఇస్తున్నాగా 
వదిలేయకు సీతాకోక చిలకలుగా...

వామ్మో బాగుందే చిట్కా 
నాకూ నేర్పిస్తే చక్క 
సూర్యున్ని కరిగిస్తాగా చినుకులుగా...

సూర్యుడు ఏడి నీతో ఆడి 
చందమామ అయిపోయాడుగా 

తూనీగా తూనీగా
ఎందాక పరిగెడతావే 
రావే నా వంకా...

(Music)

ఆ కొంగలు ఎగిరి ఎగిరి 
సాయంత్రం గూటికి మళ్ళి 
తిరిగొచ్చే దారిని ఎపుడూ 
మరిచిపోవేలా...

ఓ సారి అటువైపు వెళుతుంది 
మళ్లీ ఇటు వైపొస్తుంది
ఈ రైలుకి సొంతూరు ఎదో 
గుర్తు రాదెలా...

కూ కూ బండి మా ఊరుంది 
ఉండి పోవే మాతొపాటుగా...

తూనీగా తూనీగా 
ఎందాక పరిగెడతావే 
రావే నా వంకా...

దూరంగా పోనీక 
ఉంటాగా నీ వెనకాలే 
రాని సాయంగా...

ఆ వంక ఈ వంక 
తిరిగావే ఎంచక్కా 
ఇంకా నా చాలింకా 
ఇంతేగా నీ రెక్కా 
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా...

(Music)

Song: Tuneega Tuneega
Movie: Manasantha Nuvve
Singers: Usha, Sanjeevini
Lyrics: Sirivennela Seetharama Sastry
Music: R.P. Patnaik

Post a Comment

0 Comments

–>