Emai Pothane Song Lyrics || O Pitta Katha Movie



(Music)

ఏమై పోతానే మనసిక ఆగేలా లేదే
ఆశల అంచులపై
చిలిపిగ నువ్వడుగేస్తుంటే

అరెరే నా జగమంటూ
నీ సగమంటూ వేరుగ లేదంటే
అదిరే గుండెల చుట్టూ
కావలి కాస్తూ ఊపిరి నివ్వాలే

ఏమై పోతానే మనసిక ఆగేలా లేదే
ఆశల అంచులపై
చిలిపిగ నువ్వడుగేస్తుంటే

(Music)

తెలియదుగా ఆ...

తెగ తొందర చేసిన వయసుకి
అసలు కథా
ఒక మాటని పలకని పెదవుల ఎదురుగ

కళ్ళు కళ్ళు వాదిస్తున్నాయే
మనసులు మళ్ళీ మళ్ళీ లొంగి పోవాలే
లేనిపోని ఆటలేమిటో నిన్ను నన్ను
ప్రేమలోకి లాగుతున్నాయే

అరె ఏమై పోతానే మనసిక ఆగేలా లేదే
ఆశల అంచులపై
చిలిపిగ నువ్వడుగేస్తుంటే

(Music)

గడవదుగా ఆ...

ఒక నిమిషము గుండెకు
నీ సడి వినపడకా
నిను వెతికిన తలపులు
అలిసిన క్షణమిక

నన్ను కొట్టి ఆడుకోమాకే
ఉన్నట్టుండి నన్నే వీడి వెళ్ళిపోమాకే
నీలో నేనే ఉన్నట్టున్నానే
తొంగి చూడు నువ్వే లేని నేనై ఉంటానే

అరె ఏమై పోతానే మనసిక ఆగేలా లేదే
ఆశల అంచులపై
చిలిపిగ నువ్వడుగేస్తుంటే

అరెరే నా జగమంటూ
నీ సగమంటూ వేరుగా లేదంటే
అదిరే గుండెల చుట్టూ
కావలి కాస్తూ ఊపిరి నివ్వాలే

ఏమై పోతానే మనసిక ఆగేలా లేదే
ఆశల అంచులపై
చిలిపిగ నువ్వడుగేస్తుంటే

Song: Emai Pothane
Movie: O Pitta Katha
Singer: Praveen Lakkaraju
Lyrics: Sreejo
Music: Praveen Lakkaraju

Post a Comment

0 Comments

–>