Nuvve Nuvve Kavalantundi Song Lyrics||Nuvve Nuvve

Nuvve Nuvve Kavalantundi Song is from Nuvve Nuvve movie sung by Chitra gaaru. Music composed by Koti gaaru and lyrics written by Sirivennela Sitarama Sastry garu.


ఏ చోట ఉన్నా...ఉన్నా...ఉన్నా...
నీ వెంట లేనా...లేనా...లేనా...

సముద్రమంతా నా కన్నుల్లో 
కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో 
నిట్టూర్పు సెగలౌతుంటే 

రేపు లేని చూపు నేనై 
శ్వాస లేని ఆశ నేనై 
మిగలనా....

నువ్వే నువ్వే కావాలంటుంది 
పదేపదే నా ప్రాణం 
నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది 
ప్రతి క్షణం నా మౌనం

ఏ చోట ఉన్నా...
నీ వెంట లేనా...

సముద్రమంతా నా కన్నుల్లో 
కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో 
నిట్టూర్పు సెగలౌతుంటే 

(Music)

నేల వైపు చూసే నేరం చేసావనీ
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని 
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమనీ
తల్లి తీగ బందిస్తుందా మల్లె పూవుని 

ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం 
ఇకనైనా చాలించమ్మా వేధించడం 
చెలిమై కురిసే సిరి వెన్నెలవో 
క్షణమై కరిగే కలవా....

నువ్వే నువ్వే కావాలంటుంది 
పదేపదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది
ప్రతి క్షణం నా మౌనం 

రేపు లేని చూపు నేనై
ఆశ లేని శ్వాస నేనై 
మిగలనా....

(Music)

వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా
నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా
కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా

నాక్కూడ చోటేలేని నా మనసులో 
నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో 
వెతికే మజిలి దొరికే వరకు 
నడిపే వెలుగై రావా....

నువ్వే నువ్వే కావాలంటుంది 
పదేపదే నా ప్రాణం 
నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది 
ప్రతి క్షణం నా మౌనం

ఏ చోట ఉన్నా...
నీ వెంట లేనా...

సముద్రమంతా నా కన్నుల్లో 
కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో 
నిట్టూర్పు సెగలౌతుంటే 

(Music)

Song: Nuvve Nuvve Kavalantundi
Movie: Nuvve Nuvve
Banner: Sri Sravanthi Movies
Producer: Sravanthi Ravi kishore
Directer: Trivikram
Music: Koti
Cast: Tarun, Shreya
Lyrics: Sirivennela Sitarama Sastry
Singer: K.S Chitra

Post a Comment

0 Comments

–>