- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
(Music)
కటిక వాళ్ళ కధలు ముగియ
కంటి కొసల అగ్నులెగయ
కండ కండగా ఒళ్ళు నరక
కసికసిగా గొంతు కొరక
మృత్యువచ్చి కేకలిడగా
ప్రళయనాదం జగతి వినగా
చుక్క చుక్కగా నెత్తురోడ
దిక్కులన్నీ నక్కి చూడ
చిత్రహింస చేయుచుండ
శత్రువులే మాసిపోవగా...
విళయ ప్రళయ మూర్తి
వచ్చింది ఇదే కాంచన
హే మరణమృదంగం అయ్
నిను చీల్చ వచ్చె కాంచన
కసిగ కసిగ కసిగ నిన్ను ఖండిచేసి పోగా
కాలరాచి నేడు నీ కథ ముగించేసి పోగ
హే వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది
వచ్చింది వచ్చిందిరా...
హోరుగాలి లాగ వచ్చెరా
నిన్ను నరికిపోగులెట్ట వచ్చెరా
ఆడ మగ కలిసి వచ్చెరా
నిన్ను మింగివేయ కాళికొచ్చేరా రే రే రేయ్
విళయ ప్రళయ మూర్తి
వచ్చింది ఇదే కాంచన
హే మరణమృదంగం అయ్
నిను చీల్చ వచ్చె కాంచన
(Music)
కపాల మాలలు అగ్గిని కురియ
కన్నుల మంటల సెగలు మెరయ
అకాల వేళలో వేటకు వచ్చె లోకమదిరిపోగ
టక్కరి నక్కలు చేతికి చిక్కంగ
రక్కసి మూకల పీకలు నొక్కంగ
కాళిక నాలుక తెరుచుకువచ్చె కాలమాగిపోగ
కన్నుల పాముల గొంతున
త్రాచుల అందంగా మెరిసే నాగులు
కట్ల పాము చుట్ల పాము
తెల్లంగ మెరిసే నాగులు
పడగ పాము మన్ను పాము
నీటైన నీటి పాము
పుట్టల నాగులు బుట్టల నాగులు
తోడై వచ్చిందే
హోరుగాలి లాగ వచ్చెరా
నిన్ను నరికిపోగులెట్ట వచ్చెరా
ఆడ మగ కలిసి వచ్చెరా
నిన్ను మింగివేయ కాళికొచ్చేరా రే రే రేయ్
ఉరిమురిమి గొంతు నులిమి
ఉరిమురిమి గొంతు నులిమి కడతెరుస్తానే
(Music)
కన్నుల నిప్పుల మంట మండుతోంది
కాలుడి గజ్జెల మంట మోగుతోంది
పగల పొగల సెగ రగిలెను
మూడే కాలం వచ్చింది
చుక్కలు నేలకు రాలిపోయే వేళ
దిక్కులు అన్నీ పేలిపోయే వేళ
సింగపు నడక సింగారి రూపాన
మృత్యువు వచ్చింది
మండే తన కళ్ళు చూసి సూరీడే చిన్నబోగ
చెలరేగే వేగం చూసి సేలయేళ్ళే అదిరిపోగ
గొంతుకలే కోసి కోసి నెత్తుటేళ్ళు పారిస్తోంది
లోకాలన్నీ భయంతోటి వణికిపోగా
హోరుగాలి లాగ వచ్చెరా
నిన్ను నరికిపోగులెట్ట వచ్చెరా
ఆడ మగ కలిసి వచ్చెరా
నిన్ను మింగివేయ కాళికొచ్చేరా రే రే రేయ్
విళయ ప్రళయ మూర్తి
వచ్చింది ఇదే కాంచన
హే మరణమృదంగం అయ్
నిను చీల్చ వచ్చె కాంచన
చేసిన శపధం ముగియు వరకు
రెప్పలకేది కునుకు కునుకు
అదిలిస్తే నింగే బెదురుకదిలిస్తే భూమి అదురు
కంటి ఎరుపు చూడు చూడు
ఆరిపోని సెగలు రేపు
ముష్కర మూకలు ముక్కలు ముక్కలు
మూడుల గుంటలు ముక్కలు చెక్కలు
చిచ్చర కన్ను తెరుచుకున్నది
జరుగునిక్కడ అసుర సంహారం
Song: Vilaya Pralaya Moorthy
Movie: Kanchana
Singers: Malathy,MLR Karthikeyan,Sriram
Music: S Thaman
Lyrics: Vennelakanti
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment