- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
(Music)
పెదవి దాటని మాటొకటుంది
తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది
అడగవేం త్వరగా
అడగరానిది ఏమిటి ఉంది
తెలుపవా సరిగ ఓహోహో
మనసు చాటున ఎందుకు ఉంది
తెరలు తీయ్ త్వరగా లలలా
మనసు నిన్నే తలచుకుంటోంది
వినబడదా దాని గొడవ
తలుచుకునే అలసిపోతుంద
కలుసుకునే చొరవ లేదా
ఇబ్బంది పడి ఎన్నాళ్ళిలా
ఎల్లాగ మరి
అందాల సిరి ఒళ్ళో
ఇలా వచ్చేస్తే సరి
పెదవి దాటని మాటొకటుంది
తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది
అడగవేం త్వరగా
(Music)
ఇదిగిదిగో కళ్ళలో చూడు
కనపడదా ఎవ్వరున్నారు
ఎవరెవరో ఎందుకుంటారు
నీ వరుడె నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు
నూరెళ్ళిలా చిలిపి కల
బాగుంది గానీ
నీకోరిక కలైతే ఎలా
పెదవి దాటని మాటొకటుంది
తెలుసుకో సరిగా ఏ హే హే
అడుగుతావని ఆశగ ఉంది
అడగవేం త్వరగా లలలా
(Music)
హే కోయిలా ఓ కోయిలా
హే కోయిలా ఓ కోయిలా
హే కోయిలా ఓ కోయిలా
Song: Pedavi Datani
Singers: Ramana Gogula and Upadrasta Sunitha
Lyrics: Sirivennela Sitarama Sastry
Music: Ramana Gogula
Movie: Thammudu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment