Featured Post

Suryudivo Chandrudivo Song Lyrics In Telugu||Sarileru Neekevvaru

Suryudivo chandrudivo song is from Sarileru Neekevvaru movie sung by B Praak. Music composed by Devi Sri Prasad and lyrics written by Ramajogayya Sastry.


తద్ది తలాంగు తయ్య
తక తద్ది తలాంగు తయ్య
మనసంతా ఇవాళ 
అహా స్వరాల ఆనంద మాయె హొయ్య

తద్ది తలాంగు తయ్య
తక తద్ది తలాంగు తయ్య 
పెదవుల్లో ఇవాళ
ఎన్నో రకాల చిరునవ్వు చేరె హొయ్య

సూర్యుడివో చంద్రుడివో 
ఆ ఇద్దరీ కలయికవో 
సారధివో వారధివో 
మా ఊపిరి కన్న కలవో

విశ్వామంత ప్రేమ పండించగా
పుట్టుకైన ఋషివో 
సాటివారికై నీ వంతుగా
ఉద్యమించు కృషివో
మా అందరిలో ఒకడైన మనిషివో

సూర్యుడివో చంద్రుడివో 
ఆ ఇద్దరి కలయికవో 
సారధివో వారధివో 
మా ఊపిరి కన్న కలవో

తద్ది తలాంగు తయ్య
తక తద్ది తలాంగు తయ్య 
మనసంతా ఇవాళ
అహా స్వరాల ఆనందమాయె హొయ్య

తద్ది తలాంగు తయ్య
తక తద్ది తలాంగు తయ్య
పెదవుల్లో ఇవాళ
ఎన్నో రకాల చిరునవ్వు చేరె హొయ్య

(Music)

గుండె లోతుల్లో గాయం
నువ్వు తాకితే మాయం 
మండు వేసవిలో పండు వెన్నెలలా 
కలిసింది నీ సహాయం

పొలమారే ఆశల కోసం 
పొలిమేరలు దాటొచ్చావు
తలరాతలు వెలుగయ్యేలా 
నేనున్నానన్నావు

అడగందే అక్కర తీర్చే 
నీ మంచిని పొగడాలంటే 
మాలో పలికే మాటలు చాలవు

సూర్యుడివో చంద్రుడివో 
ఆ ఇద్దరి కలయికవో 
సారధివో వారధివో 
మా ఊపిరి కన్న కలవో 

(Music)

దేవుడెక్కడో లేడు 
వేరే కొత్తగా రాడు 
మంచి మనుషులలో 
గొప్ప మనసు తనై ఉంటాడు నీకు లాగా 

ఏ లోక కల్యాణాన్ని
ఆశించి జన్మిచ్చిందో 
నిను కన్న తల్లి కడుపు 
నిండార పండింది 

నీలాంటి కొడుకుని మోసే 
ఈ భూమి భారతి సైతం
నీ పయనానికి జయహో అన్నది 

సూర్యుడివో చంద్రుడివో 
ఆ ఇద్దరి కలయికవో 
సారధివో వారధివో 
మా ఊపిరి కన్న కలవో

తద్ది తలాంగు తయ్య
తక తద్ది తలాంగు తయ్య
మనసంతా ఇవాళ
అహా స్వరాల ఆనంద మాయె హొయ్య

తద్ది తలాంగు తయ్య
తక తద్ది తలాంగు తయ్య 
పెదవుల్లో ఇవాళ
ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్య


Song: Suryudivo Chandrudivo
Movie: Sarileru Neekevvaru 
Singer: B Praak
Music: Devi Sri Prasad
Lyrics: Ramajogayya Sastry
Music Label: Lahari Music | T-Series



Comments