Featured Post

Kokila Kokila Ku Annadi Song Lyrics - Pellichesukundam


(మ్యూజిక్)

కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ యన్నది
దేవత నీవని మమతల కోవెల
తలుపు తెరిచివుంచాను

ప్రియ ప్రియ జయీ భవ కౌగిళ్ళలో
సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో

కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ యన్నది

(మ్యూజిక్)

గుండె గూటిలో నిండిపోవా
ప్రేమ గువ్వలాగ ఉండిపోవా
ఏడు అడుగుల తోడు రావా
జన్మ జన్మ నన్ను నీడకావా

లోకం మన లోగిలిగా కాలం మన కౌగిళిగా
వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా
ఆ ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా

కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ యన్నది

(మ్యూజిక్)

వాలు కళ్ళతో వీలునామా
వీలు చూసి ఇవ్వు చాలు భామా
వేళాపాళాలు ఏలనమ్మా
వీలు లేనిదంటూ లేదులేమ్మా

మనమేలే ప్రేమికులం
మనదేలే ప్రేమ కులం
కాలాన్ని ఆపగలం
మన ప్రేమను చూపగలం

కల్లలన్నీ తీరే కమ్మని క్షణమే
కన్నుల ముందుందమ్మ

కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ యన్నది
దేవత నీవని మమతల కోవెల
తలుపు తెరిచివుంచాను

ప్రియ ప్రియ జయీ భవ కౌగిళ్ళలో
సఖి సఖి సుఖీభవ సందిళ్లలో 

Music: Koti



Comments