- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
ఏయ్ పిల్లా పరుగున పోదామా
ఏ వైపో జంటగ ఉందామా
రా రా కంచె దూకి చక చక ఉరుకుతు
ఆ రంగుల విల్లుని తీసి
ఈ వైపు వంతెన వేసి రావా
(Music)
ఎన్నో తలపులు ఏవో కలతలు
బతుకే పోరవుతున్నా
గాల్లో పతంగిమల్లె ఎగిరే కలలే నావి
ఆశ నిరాశల ఉయ్యాలాటలు
పొద్దుమాపుల మధ్యే
నాకంటూ ఉందింతే ఉందంతా ఇక నీకే
(Music)
నీతో ఇలా ఏ బెరుకు లేకుండా
నువ్వే ఇగ నా బతుకు అంటున్నా
నా నిన్న నేడు రేపు కూర్చి నీకై
పరిచానే తలగడగా
నీ తలను వాల్చి కళ్ళు తెరిచి
నా ఈ దునియా మిలమిల చూడే
వచ్చే మలుపులు రస్తా వెలుగులు
జారే చినుకుల జల్లే
బడుగూ పేకా మల్లె నిన్ను నన్ను అల్లే
పొద్దే తెలియక గల్లీ పొడుగున
ఆడే పిల్లల హోరే
నాకంటూ ఉందింతే ఉందంతా ఇక నీకే
ఏయ్ పిల్లా పరుగున పోదామా
ఏ వైపో జంటగ ఉందామా
(Music)
పారే నదై నా కలలు ఉన్నాయే
చేరే దరే ఓ వెదుకుతున్నాయే
నా గుండె ఓలి చేసి ఆచి తూచి
అందించా జాతరలా
ఆ క్షణము చాతి పైన సోలి చూశా
లోకం మెరుపుల జాడే
నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి
నేలన కనిపిస్తుందే
మారే నీడలు గీసే తేలే బొమ్మలు చూడే
పట్నం చేరిన పాలపుంతలు
పల్లెల సంతలు బారే
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే
Song: Ay Pilla
Movie: Love Story
Music: Pawan Ch
Lyrics: Chaithanya Pingali
Singer: Haricharan
Director: Sekhar Kammula
Comments
Post a Comment