Featured Post

Gudi Gantalu Mogina Vela Song Lyrics || Ninne Premista




(Music)

గుడిగంటలు మ్రోగినవేళ
మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ
తెగ తొందర పెడుతోంది

(Music)

గుడిగంటలు మ్రోగినవేళ
మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగుల వేళ
తెగ తొందర పెడుతోంది

ఆ దేవుని పూజకు నువ్వొస్తే
నా దేవిని చూడగ నేనొస్తే
అది ప్రేమకు శ్రీకారం

గుడిగంటలు మ్రోగిన వేళ
మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగుల వేళ
తెగ తొందర పెడుతోంది

(Music)

శ్రీ రంగనాధ స్వామి వెంట
దేవేరి తరలి వచ్చెనంట
ఆ జంట చూడముచ్చటంట
వెయ్యైన కళ్ళు చాలవంట

(Music)

నా చిరునవ్వయి నువ్వే ఉండాలి ఉండాలి
నా కనుపాపకు రెప్పయి ఉండాలి ఉండాలి
చెలి గుండెలపై నిద్దుర పోవాలి
ఇరు మనసుల్లో ప్రేమే ఎదగాలి ఎదగాలి

నా చెలి అందెల సవ్వడి నేనై
నా చెలి చూపుల వెన్నెల నేనై

(Music)

చెలి పాదాల పారాణల్లే
అంటుకు తిరగాలి
నుదుటి బొట్టయి నాలో నువ్వు
ఏకమవ్వాలి

గుడిగంటలు మ్రోగినవేళ
మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ
తెగ తొందర పెడుతోంది

(Music)

వెచ్చని ఊహకు ఊపిరి పోయాలి
పోయాలి
నెచ్చెలి పవిటికి చెంగును కావాలి
కావాలి కావాలి

కమ్మని కలలకు రంగులు పూయాలి
పూయాలి
నా చిరునామా నువ్వే కావాలి
కావాలి కావాలి

తుమ్మెద నంటని తేనెవు నువ్వై
కమ్మని కోకిల పాటవు నువ్వై
చీకటిలో చిరుదివ్వెవు నువ్వై
వెలుగులు పంచాలి

వీడని నీ నీడను నేనై
నిన్ను చేరాలి

(Music)

గుడిగంటలు మ్రోగినవేళ
మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ
తెగ తొందర పెడుతోంది

ఆ దేవుని పూజకు నువ్వొస్తే
నా దేవిని చూడగ నేనొస్తే
అది ప్రేమకు శ్రీకారం

గుడిగంటలు మ్రోగినవేళ
మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ
తెగ తొందర పెడుతోంది

(Music)

Song: Gudi Gantalu Mrogina Vela
Movie: Ninne Premistha
Starring: Nagarjuna, Srikanth, Soundarya, Rejendra Prasad
Music: S.A. Rajkumar
Singers: Rajesh,K.S Chithra
Lyrics: Gantadi Krishna

Comments