- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
Kannula Baasalu Song Lyrics In Telugu||7/G Brundhavana Colony
Kannula Baasalu song is from the movie 7/G Brundhavan Colony sung by Karthick.Music composed by Yuvan Shankar Raja and lyrics written by Shiva Ganesh.
కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మోయలేవులే
ఇది అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మోయలేవులే
గాలి వీచి ఆకు రాలిన
కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్ని తిన్న గాని
మనసు మాత్రం మారదులే
ఒకపరి మగువ చూడగనే
కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే
యువకుల మనసులు తెలియవులే
కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మోయలేవులే
అడవిలో కాచే వెన్నెల
అనుభవించేదెవ్వరులే
కన్నుల అనుమతి పొందీ
ప్రేమ చెంతకు చేరదులే
దూరాన కనపడు వెలుగు
దారికే చెందదులే
మెరుపుల వెలుగును పట్టగ
మినుగురు పురుగుకి తెలియదులే
కళ్ళు నీకు సొంతమట
కడగళ్ళు నాకు సొంతమట
అల కడలిదాటగానే
నురుగులిక ఒడ్డుకు సొంతమటా
కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మోయలేవులే
లోకాన పడుచులు ఎందరున్నను
మనసొకరిని మాత్రమే వరియించులే
ఒకపరి దీవించ ఆశించగా
అది ప్రాణంతోనే ఆటాడులే
మంచు బిందువొచ్చి ఢీ కొనగా
ఈ ముల్లే ముక్కలు అయిపోయెలే
భువిలో ఉన్న అబద్దాలే
అరె చీరను కట్టి స్త్రీ ఆయెలే
ఉప్పెనొచ్చిన కొండ మిగులును
చెట్లు చేమలు మాయవునులే
నవ్వు వచ్చులే ఏడుపొచ్చులే
ప్రేమలో రెండూ కలిసివచ్చులే
ఒకపరి మగువ చూడగనే
కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే
యువకుల మనసులు తెలియవులే
కన్నుల బాసలు...
ఏ కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మోయలేవులే
గాలి వీచి ఆకు రాలిన
కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్ని తిన్న గాని
మనసు మాత్రం మారదులే
Song: Kannula Baasalu
Movie: 7G Brundhavana Colony
Lyrics: Shiva Ganesh
Singer: Karthik
Banner: Sri Surya Movies
Producer: A.M.Ratnam
Director: Arvind Krishna
Music: Yuvan Shankar Raja
Cast: Ravi Krishna, Soniya Agarwal
Comments
Post a Comment