Adiga Brahmani Song Lyrics || Emandoy Sreevaru Movie || Srikanth, Sneha



(Music)

అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
అటులే కమ్మను ఆ కమ్మని ఆ మాటలే
ఋజువై నిన్ను నేను కలుపుకున్నా

నూరేళ్లు నిన్ను విడననీ హొయ్
ఈ రేయి నేను కలగనీ
కలలో బ్రహ్మ పలుకులే
తెలుసా నీకు నిజమనీ

నిజమే నిజమే
నాక్కూడ తెలుసులే

అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన

(Music)

మునుపటి జన్మలతో
ముడిపడు పుణ్యములే
నీ నీడ నన్ను చేర్చనీ
బతుకే నిండు పున్నమి

నా కంటిపాప నీవే
నీ కంటి రెప్ప నేనే
ఏ నలుసులింక నిన్ను
నేడు తాకలేవులే

కలిసిన మనసులలో
కలతలు ఉండవులే
జతపడు హృదయములే
జగములే మరుచునులే

నిజముగా కలకాదుగా
నిజమే నిజమే కలలాంటి నిజమిదే

అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన

(Music)

చిరు చిరు సరసాలకు
మురిసిన సరదాలకు
కొరతలు లేని కాపురం
తెలియదు వేరు కావటం

నే నాటుకున్న పైరే
ఏనాటికైన ఎదిగి
మన కొడుకులా రేపు
మన కడుపు పండులే

గడిచిన గతమంత చేదుగా మిగిలేనే
కలిగిన చేదంతా తొలగునే ఇకపైన
నిజముగా ఇది జరుగునా
నిజమే నిజమే నీ ఆశ తీరునే

అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా
నిన్నటి నిదురలోని కలలలోన
అటులే కమ్మను ఆ కమ్మని ఆ మాటలే
ఋజువై నిన్ను నేను కలుపుకున్నా

నూరేళ్లు నిన్ను విడననీ హొయ్
ఈ రేయి నేను కలగనీ
కలలో బ్రహ్మ పలుకులే
తెలుసా నీకు నిజమనీ

నిజమే నిజమే
నాక్కూడా తెలుసులే

(Music)

Song: Adiga Brahmani
Movie: Emandoy Sreevaru
Banner: Sri Ram Arts
Producer: M.Dasaradha Raju
Directer: Sathi Babu
Music: Srikanth Deva
Cast: Srikanth, Sneha
Lyrics: Anantha Sriram
Singers: Karthik, Chitra


Post a Comment

0 Comments

–>