Featured Post

Rama Chakkani Seethaki Song Lyrics - Godavari


నీల గగన ఘనవిచలన
ధరణిజ శ్రీ రమణ
మధుర వదన నళిన నయన
మనవి వినరా రామా

(Music)

రామ చక్కని సీతకి
అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకీ
ఇంకెవరో మొగుడంట

రామ చక్కని సీతకీ

(Music)

ఉడత వీపున వేలు విడిచిన
పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును
ఎత్తిన ఆ రాముడే

ఎత్తగలడా సీత జడనూ
తాళి కట్టే వేళలో?

రామ చక్కని సీతకీ

(Music)

ఎర్రజాబిలి చేయిగిల్లి
రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే
చెప్పలేమని కనులు చెప్పే

నల్లపూసైనాడు దేవుడు
నల్లనీ రఘురాముడూ
రామ చక్కని సీతకీ

(Music)

చుక్కనడిగా దిక్కునడిగా
చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన
నీటి తెరలే అడ్డునిలిచే

చూసుకోమని మనసు తెలిపే
మనసు మాటలు కాదుగా

రామ చక్కని సీతకి
అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకీ
ఇంక ఎవరో మొగుడంట

రామ చక్కని సీతకీ

(Music)

ఇందువదన కుందరదన
మందగమన భామా
ఇందువలనా ఇందువదనా

ఇంత మదనా ప్రేమా

(Music)

Song: Rama Chakkani
Music: K.M Radhakrishnan
Lyrics: Veturi Sundararama Murthy
Singer: Gayathri
Movie: Godavari


Comments