Featured Post

Neekosam Neekosam Song Lyrics In Telugu - Nenunnanu


(Music)

వేసవికాలం వెన్నెల్లాగ
వానల్లో వాగుల్లాగ
వయసు ఎవరికోసం

శీతాకాలం ఎండల్లాగ
సంక్రాంతి పండుగలాగ
సొగసు ఎవరికోసం

ఓరోరి అందగాడా 
నన్నేలు మన్మధుడా
నీ కోసం నీ కోసం నీ.. కోసం
నీ కోసం నీ కోసం నీ.. కోసం

నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి
నే పండగ చేసే సందడి వేళ
ఆకు వక్క సున్నం

నీ కోసం నీ కోసం నీ.. కోసం
నీ కోసం నీ కోసం నీ.. కోసం

(Music)

గుండె చాటుగా ఉండనందిక
ఇన్నినాళ్లు దాచుకున్న కోరిక
ఉన్నపాటుగా ఆడ పుట్టుక
కట్టుబాటు దాటలేదుగా

కన్నె వేడుక విన్నవించగా
అందుబాటులోనె ఉన్నానుగా
తీగ చాటుగా మూగ పాటగా
ఆగిపోకె రాగమాలికా

నిలువెల్ల నీ జతలోన
చిగురించు లతనై రానా
కొనగోటి కొంటెతనాన
నిను మీటన చెలి వీణా

అమ్మమ్మో అబ్బబ్బో
ఆ ముచ్చట తీరంగ
నీ మెళ్లొ హారంగ
నా రెక్కలు విచ్చె సోకులు తెచ్చి
అందిస్తున్న మొత్తం

నీ కోసం నీ కోసం నీ.. కోసం
నీ కోసం నీ కోసం నీ.. కోసం

(Music)

సిగ్గుపోరిక నెగ్గలేవుగా
ఏడు మల్లెలెత్తు సుకుమారమా
సాయమియ్యక మోయలేవుగా
లేత సోయగాల భారమా

కౌగిలింతగా స్వాగతించగా
కోరుకున్న కొంగు బంగారమా

తాళి బొట్టుగా కాలి మెట్టెగా
చేరుకోవ ప్రేమ తీరమా
మునిపంటి ముద్దర కాన
చిగురంటి పెదవుల పైన

మురిపాల మువ్వను కాన
దొరగారి నవ్వులలోన

నిద్దర్లో పొద్దుల్లో
నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి
నువ్వు వద్దనలేని పద్దతిలోనె
ముద్దుల్నెన్నో తెచ్చా

నీ కోసం (నీ కోసం) నీ కోసం (నీ కోసం)
నీ కోసం (నీ కోసం) నీ కోసం (నీ కోసం)

వేసవికాలం వెన్నెల్లాగ
వానల్లో వాగుల్లాగ
వయసు ఎవరి కోసం

శీతాకాలం ఎండల్లాగ
సంక్రాంతి పండుగలాగ
సొగసు ఎవరి కోసం

ఓరోరి అందగాడ
నన్నేలు మన్మధుడా

నీ కోసం (నీ కోసం)
నీ కోసం (నీ కోసం) నీ.. కోసం
నీ కోసం (నీ కోసం)
నీ కోసం (నీ కోసం) నీ.. కోసం

(Music)

Song: Neekosam Neekosam
Movie: Nenunnanu
Lyrics: Sirivennela Sitarama Sastry
Music: M.M.Keeravani
Singers: Shreya Ghoshal,K.K



Comments