Featured Post

Aanandam Madike Song Lyrics - Ishq


(Music)

ఓ... ఏమైందో ఈ వేళ
ఈ గాలి రంగులేవో చల్లిందా ఓహో
అందమైన ఊహేదో మదిలో వాలి
అల్లరేదో చేసిందా ఓహో

మెత్తనైన నీ పెదవులపై
నా పేరే రాశావా
నే పలికే భాషే
నువ్వయావే వెన్నలా హో

రెండు కన్నులెత్తి
గుండెలపై నీ చూపే గీశావా
ఆ గీతే దాటి అడుగునైనా
విడువలేనే నేనిలా

ఆనందమానంద మదికే
ఏమందం ఏమందమొలికే
నీ నవ్వు నా గుండె గదికే
వెలుగే వెన్నెలా

ఆనందమానంద మదికే
ఏమందం ఏమందమొలికే
నీ పిలుపు నా అడుగు నదికే
పొంగే వరదలా

(Music)

మిలమిల మెరిసే
కనుచివరలే మినుకుల్లా
విసరకు నువ్వే
నీ చూపులే మెరుపుల్లా

మెరిసెనా మెల్లగా
దారిలోన మల్లెల వాన
కురిసెనా ధారగా
రంగు రంగు తారలతోనా

వీణలై క్షణాళిలా స్వరాలూ పూసేనా ఓ
ప్రేమలో ఓ నిమిషమే యుగాలు సాగేనా
 
ఆనందమానంద మదికే
ఏమందం ఏమందమొలికే
నీ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా

ఆనందమానంద మదికే
ఏమందం ఏమందమొలికే
నీ పిలుపు నా అడుగు నదికే
పొంగే వరదలా

Song: Aanandam Madike
Lyrics: Shreemani
Singers: Sid Sriram, Satya Yamini
Music: Mahathi Swara Sagar
Movie: Ishq (Not a Love Story)




Comments