Featured Post

Evvarineppudu Song Lyrics In Telugu - Manasantha Nuvve


ఎవ్వరినెప్పుడు తన వలలో
బంధిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులలో 
ఎగరేస్తుందో ఈ ప్రేమ

అర్ధం కాని పుస్తకమే 
అయినా గాని ఈ ప్రేమ
జీవిత పరమార్ధం తానే 
అనిపిస్తుంది ఈ ప్రేమ

ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ

ఇంతకు ముందర ఎందరితో 
ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఇద్దరితో మీ గాథే 
మొదలంటుంది ఈ ప్రేమ

కలవని మంటలలో 
కనబడుతుంది ఈ ప్రేమ
కలిసిన వెంటనే 
ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ

ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ

(Music)


Song: Evvarineppudu
Movie: Manasantha Nuvve
Music: R.P Patnaik
Lyrics: Sirivennela
Singer: K.K




Comments