- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
(Music)
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
నిను కాన లేక మనసూరుకోక
పాడాను నేనూ పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
(Music)
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఎనాడైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఎనాడైనా
ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లొ తేలీ వుర్రూతలూగీ
మేఘాలతోటీ రాగాల లేఖా
నీకంపినానూ రావా దేవీ
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
నిను కాన లేక మనసూరుకోక
పాడాను నేనూ పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
(Music)
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళైనా
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళైనా
ఉండీ లేకా వున్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నీవే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
నిను కాన లేక మనసూరుకోక
పాడాను నేనూ పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై
Comments
Post a Comment