- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
(Music)
మేఘాలే తాకింది హాయ్ హైలెస్స
నవరాగంలో నవ్వింది నా మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
చేలరేగాలి రమ్మంది హల్లో అంటూ
ఒళ్ళో వాలే అందాల అప్సరస
మేఘాలే తాకింది హాయ్ హైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ
అల్లేసింది నీ మీద నా ఆశ
(Music)
తొలిసారి నిను చూసి మనసాగక
పిలిచానే చిలకమ్మ మెలమెల్లగ
తెలుగంత తీయంగ
నువ్వు పలికావే స్నేహంగా
చెలిమన్న వలవేసి నను లాగగా
చేరాను నీ నీడ చలచల్లగా
గిలిగింత కలిగేలా
తొలి వలపంటే తేలిసేలా
ఆ.. కునుకన్న మాటే నను చేరక
తిరిగాను తెలుసా ఏం తోచక
మేఘాలే తాకింది హాయ్ హైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
(Music)
తొలి పొద్దు వెలుగంత చిరువేడిగా
నిలువెల్ల పులకింత చిగురించగా
దిగులేదో హాయేదో
గుర్తు చెరిపింది ఈ వింత
ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా
నిజమేదో కల ఏదో మరిపించగా
పగలేదో రేయేదో
రెండు కలిశాయి నీ చెంత
ప్రేమంటే ఇంతే ఏమో మరి
దానంతు ఏదో చూస్తే సరి
మేఘాలే తాకింది హాయ్ హైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ
అల్లేసింది నీ మీద నా ఆశ
మేఘాలే తాకింది హాయ్ హైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
Comments
Post a Comment