Featured Post

Samayama Song Lyrics - Hi Nanna

  (Music) Samayamaaa Bhale Saayam Cheshaavamma Ottuga Ottuga Kanulake.. Thana Roopannandhinchave Guttuga Ho Idhi Saripodhaaa Sare Sare Thorapadakoo Thadhupari Katha Yetukoo Yetu mari Thana Nadakoo Chivariki Yevarenakoo Samayamaaa Bhale Saayam Cheshaavamma Ottuga Ottuga Kanulake... Thana Roopannandhinchave Guttuga Ho Thanu Evare Nadiche Thara Thalukula Dhara Thanu Chusthunte Radhe Niddhura Palike Yera Kunuke Aura Alalai Ponge Andham Aadhi Thana Pera (Music) Aakashanne Thagesindhe Thana Kannullo Neelam Choopullone Yedho Indhrajaalam Bangaaru Vaanallo Ninda Munche Kaalam Chusthamanukoledhe Naalaantollam Bhoogolanne Thippese Aa Bunga Muthi Vainam Choopisthundhe Thanalo Inko Konam Changavi Chempallo Chengumantu Mounam Chusthu Chusthu Thisthu Undhe Praanam Thanu Cherina Prathi Chotila Chala Chitrangunnadhe Thanatho Ilaa Prathi Gnapakam Chaya Chitram Aayinadhe Sare Sare Thorapadakoo Thadhupari Katha Yetukoo Yetu mari Thana Nadakoo Chivariki Yevarenakoo Samayamaa Bhale Saayam Cheshaava...

Oke Oka Jeevitham Song Lyrics - Mr. Nookayya


(Music)

ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపోనీకు
మళ్ళి రాని ఈ క్షణాన్ని మన్నుపాలు కానీకు
కష్టమనేది లేని రోజంటు లేదు కదా
కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా

హో ఓవ్ ఓవ్ అమ్మ కడుపు వదిలిన అడుగడుగు
హో ఓవ్ ఓవ్ ఆనందం కోసమే ఈ పరుగు
హో ఓవ్ ఓవ్ కష్టాల బాటలో కడ వరకు
హో ఓవ్ ఓవ్ చిరునవ్వు వదలకు

ఓ ఓహో ఓ ఓహో ఓ

(Music)

నువ్వెవరు నేనెవరు
రాసినదెవరు మన కథలు
నువ్వు నేను చేసినవా
మన పేరున జరిగే పనులు

ఇది మంచి అని అది చెడ్డదని
తూకాలు వెయ్యగల వారెవరు
అందరికి చివరాకరికి
తుది తీర్పు ఒక్కడే పైవాడు

అవుతున్న మేలు, కీడు
అనుభవాలేగా రెండు
దైవం చేతి బొమ్మలేగా
నువ్వు నేను ఎవరైనా

తలో పాత్ర వెయ్యకుంటే
కాలయాత్ర కదిలేనా

ఓవ్ ఓవ్ ఓ నడి సంద్రమందు దిగి నిలిచాకా
ఓవ్ ఓవ్ ఓ ఎదురీదకుండ మునకేస్తావా
ఓవ్ ఓవ్ ఓ నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని
హో ఓవ్ ఓవ్ అద్దరికి చేర్చవా

ఓ ఓహో ఓ యే హే

(Music)

పుట్టుకతో నీ అడుగు
ఒంటరిగా మొదలైనదిలే
బతుకు అనే మార్గములో
తన తోడెవరు నడవరులే

చీకటిలో నిశి రాతిరిలో
నీ నీడ కూడ నిను వదులునులే

నీవారు అను వారెవరు
లేరంటూ నమ్మితే మంచిదిలే
చితి వరకు నీతో నువ్వే
చివరంట నీతో నువ్వే

చుట్టూ ఉన్న లోకమంత
నీతో లేనే లేదనుకో
నీ కన్నుల్లో నీరు తుడిచే
చేయి కూడా నీదనుకో

ఓవ్ ఓవ్ ఓ లోకాన నమ్మకం లేదసలే
ఓవ్ ఓవ్ ఓ దాని పేరు మోసమై మారెనులే
ఓవ్ ఓవ్ ఓ వేరెవరి సాయమో ఎందుకులే
ఓవ్ ఓవ్ ఓ నిన్ను నువ్వు నమ్ముకో

ఓ ఓహో ఓ ఓ యే యే 

(Music)

Song: Oke Oka Jeevitham
Movie: Mr.Nookayya
Music: Yuvan Shankar Raja
Lyrics: Ramajogayya Sastry
Singers: Haricharan
Starring: Manchu Manoj, Kriti Kharbanda, Sana Khan, Raja


Comments