- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుందని
అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు
ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో
మనసున మనసై బంధం వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈపైన
కడ దాక సాగనా
దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుందని
అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు
(Music)
నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం
ఈ మాట సత్యం
నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతిక్షణం
సుఖమేగ నిత్యం
పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది
ఇదే మాట గుండెల్లో సదా మోగుతోంది
నేనే నీకోసం నువ్వే నాకోసం
ఎవరేమి అనుకున్న
దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుందని
అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు
(Music)
ప్రేమనే మాటకర్ధమే తెలియదు
ఇన్నాళ్ళ వరకు
మనసులో ఉన్న అలజడే తెలియదు
నిను చేరే వరకు
ఎటెల్లేదో జీవితం నువ్వే లేకపోతే
ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే
నువ్వూ నీ నవ్వూ నాతో లేకుంటే
నేనంటూ ఉంటానా
దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుందని
అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు
ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో
మనసున మనసై బంధం వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈపైన
కడ దాక సాగనా
దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుందని
అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు
Song: Devudu karunisthadani
Movie: Prema Katha
Singers: Rajesh, Anuradha Sri Ram
Lyrics: Sirivennela Sitarama Sastry
Music: Sandeep Chowta
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment