- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
ప్రేమంటే ఏమిటంటే
నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే
అది నీకివ్వగానె తెలిసే
ప్రేమంటే ఏమిటంటే
నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే
అది నీకివ్వగానె తెలిసే
ఇదివరకు తెలియంది ఈ అనుభవం
ఎద మేలుకొలిపింది ఈ పరిచయం
ఓ హో హో ఓ...
ఓ హో హో ఓ...
ప్రేమంటే ఏమిటంటే
నిను ప్రేమించినాక తెలిసే
(Music)
నీ కళ్ళ వాకిళ్లలో
తలుపు తెరిచెను ప్రేమా ప్రేమా
మోహాల ముంగిళ్లలో
వలపు కురిసెను ప్రేమా ప్రేమా
ఈనాడే తెలిసింది తొలిసారిగా
ఎంత తీయంది ప్రేమని
ఆకాశ దీపాలు ఇల చేరగా
తెర తీసింది ఆమని
ఇది సంగీతమో తొలి సంకేతమో
ఇది ప్రియగీతమో మధు జలపాతమో
ప్రేమంటే ఏమిటంటే
నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే
అది నీకివ్వగానె తెలిసే
(Music)
ఏనాడు ఏ దేవతో
మనను కలిపిన వేళా వేళా
ఈనాడు ఈ దేవితో
మనసు తెలిపెను చాలా చాల
కాలాలు ఓకసారి ఆగాలిలే
మన తొలిప్రేమ సాక్షిగా
లోకాలు మన వెంట సాగాలిలే
మన ప్రేమికుల తోడుగా
ఇది ఆలాపనో మది ఆరాధనో
మన సరసాలకే తొలి సంకీర్తనో
ప్రేమంటే ఏమిటంటే
నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే
అది నీకివ్వగానె తెలిసే
ఇదివరకు తెలియంది ఈ అనుభవం
ఎద మేలుకొలిపింది ఈ పరిచయం
ఓ హో హో ఓ...
ఓ హో హో ఓ...
ప్రేమంటే ఏమిటంటే
నిను ప్రేమించినాక తెలిసే
Song: Premante Yemitante
Movie: Seenu
Music: Mani Sharma
Lyrics: Vennelakanti
Singers: Hari Haran, Sujatha
Comments
Post a Comment