Featured Post

Ekkada Vunna song lyrics in Telugu||Nuvve Kavali


Ekkada unna song is from Nuvve Kavali movie sung by Gopika Poornima and Sriram.Music composed by Koti Garu and lyrics written by Sirivennela Sitarama Sastry Garu.

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
చెలీ ఇదేమల్లరీ...
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది
అరే ఇదేం గారడీ...

నేను కూడా నువ్వయానా
పేరుకైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా...
హో.. దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా...

లా లా లా ల ల ల ల
లా లా లా ల ల ల ల

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
చెలీ ఇదేమల్లరీ...

(Music)

నిద్దర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది
నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం
వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది
నీదే కాదా చెప్పు ఆ సంబరం

కనుల ఎదుట నువ్వు లేకున్నా
మనసు నమ్మదే చెబుతున్నా
ఎవరు ఎవరితో ఏమన్నా
నువ్వు పిలిచినట్టనుకున్నా

ఇది హాయో ఇది మాయో
నీకైనా తెలుసునా
ఏమిటౌతోందో ఇలా నా ఎద మాటునా
దీని పేరేనా ప్రేమా అనే ప్రియ భావనా

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
చెలీ ఇదేమల్లరీ...

(Music)

కొండల నుంచి కిందికి దూకే
తుంటరి వాగు నాతో అంది
నువ్వు అలా వస్తూ ఉంటావనీ

గుండెల నుంచి గుప్పున ఎగసే
ఊపిరి నీకో కబురంపింది
చెలి నీకై చూస్తూ ఉంటానని

మనసు మునుపు ఎపుడూ ఇంతా
ఉలికి ఉలికి పడలేదు కద
మనకు తెలియనిది ఈ వింత
ఎవరి చలవ ఈ గిలిగింత

నాలాగే నీక్కూడ అనిపిస్తూ ఉన్నదా...
ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా...
హో.. దీని పేరేనా ప్రేమా అనే ప్రియ భావనా...

నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది
అరే ఇదేం గారడీ...

నేను కూడా నువ్వయానా
పేరుకైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా...
హో.. దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా...

లా లా లా ల ల ల ల
లా లా లా ల ల ల ల


Song: Ekkada vunna
Movie: Nuvve Kavali
Singers: Gopika Poornima, Sriram
Music: Koti
Lyrics: Sirivennela Sitarama Sastry
Cast: Tarun,Richa,Sai Kiran



Recently Added








Comments