Atu Nuvve Itu Nuvve Song Lyrics In Telugu - Current Movie

Atu Nuvve Itu Nuvve Song is from the movie Current sung by Neha Bhasin.Lyrics written by Ramajogayya Sastry garu and music composed by Devi Sri Prasad.


(Music)

అటు నువ్వే ఇటు నువ్వే 
మనసెటు చూస్తే అటు నువ్వే 
ఎటు వెళుతున్న ఏం చేస్తున్న 
ప్రతి చోట నువ్వే...

అటు నువ్వే ఇటు నువ్వే 
అలికిడి వింటే అది నువ్వే 
అదమరుపైనా పెదవులపైన 
ప్రతిమాట నువ్వే...

అపుడో ఇపుడో ఎపుడైనా 
నా చిరునవ్వే నీ వలన 
తెలియని లోకం తీపిని నాకు 
రుచి చూపావులే...

పరిచయమంత గతమేనా 
గురుతుకు రాదా క్షణమైనా
ఎదురుగ ఉన్న నిజమే కానీ 
కలవైనావులే...

(Music)

రంగు రూపమంటూ 
లేనే లేనిదీ ప్రేమా
చుట్టూ శూన్యమున్న 
నిన్ను చూపిస్తూ ఉందే...

దూరం దగ్గరంటూ 
తేడా చూడదీ ప్రేమ 
నీలా చెంత చేరి 
నన్ను మాటాడిస్తుందే... 

కను పాప లోతులో 
దిగిపోయి ఇంతలా
ఒక రెప్ప పాటు కాలమైన 
మారుపే రావుగా... 

యెద మారుమూలలో 
ఒదిగున్నా ప్రాణమై 
నువ్వు లేని నేను లేనే లేను 
అనిపించావుగా...

అటు నువ్వే ఇటు నువ్వే 
మనసెటు చూస్తే అటు నువ్వే 
ఎటు వెళుతున్న ఏం చేస్తున్న 
ప్రతి చోట నువ్వే...

అటు నువ్వే ఇటు నువ్వే 
అలికిడి వింటే అది నువ్వే 
అదమరపైనా పెదవులపైన 
ప్రతిమాట నువ్వే...

(Music)

నాకే తెలియకుండా 
నాలో నిన్ను వదిలావే 
నేనే నువ్వయ్యేలా 
ప్రేమ గొడవై ఎదిగావే...

మాటే చెప్పకుండా 
నీతో నువ్వు కదిలావే 
ఎటుగా చూడనంటు 
నను ఒంటరి చేసావే...

ఏకాంత వేళలో 
ఏకాంతి లేదురా 
మనసంత కూడ జాలి లేని 
పంతాలేంటిలా..

నీ తోడు లేనిదే 
మనసుండ లేదురా 
నీ పేరు లేని ప్రేమనైన 
ఊహించేదెలా...

అటు నువ్వే ఇటు నువ్వే 
మనసెటు చూస్తే అటు నువ్వే 
ఎటు వెళుతున్న ఏం చేస్తున్న 
ప్రతి చోట నువ్వే...

అటు నువ్వే ఇటు నువ్వే 
అలికిడి వింటే అది నువ్వే 
అదమరుపైనా పెదవులపైన 
ప్రతిమాట నువ్వే...

(Music)

Song: Atu Nuvve
Movie: Current
Music: Devi Sri Prasad
Cast: Sushanth, Sneha Ullal
Lyrics: Ramajogayya Sastry
Singer: Neha Bhasin

Post a Comment

0 Comments

–>