O Manasa O Manasa Song Lyrics || Bhadra Movie

O Manasa o Manasa Song is from the movie Bhadra starting with Ravi Teja and. Meera Jasmine.This song was sung by Ravi Varma.Music composed by Devi Sri Prasad and lyrics written by Sirivennela Seetharama Sastry Garu.


(Music)

ఓ మనసా ఓ మనసా 
చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా 
నిజమే కనవా నువ్వు

చెలియ గుండె తాకలేక 
పలకనందే నా మౌనం
చెలిమి వెంట సాగలేక 
శిల అయిందే నా ప్రాణం
గతమే మరిచి బ్రతకాలే మనసా

ఓ మనసా ఓ మనసా 
చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా 
నిజమే కనవా నువ్వు

(Music)

ఎగసి పడే అల కోసం 
దిగి వస్తుందా ఆకాశం
తపన పడి ఏం లాభం 
అందని జాబిలి జత కోసం

కలిసి ఉన్న కొంతకాలం 
వెనక జన్మ వరమనుకో
కలిసి రాని ప్రేమ తీరం 
తీరిపోయిన రుణమనుకో

మిగిలే స్మృతులే వరమనుకో మనసా
మనసా మనసా

ఓ మనసా ఓ మనసా 
చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా 
నిజమే కనవా నువ్వు

(Music)

తన ఒడిలో పొదువుకుని 
భద్రంగా నడిపే నౌక
తననొదిలి వెళ్ళకని 
ఏ బంధాన్ని కోరదుగా

కడలిలోనే ఆగుతుందా 
కదలనంటు ఈ పయనం
వెలుగువైపు చూడనందా 
నిదరలేచే నా నయనం

కరిగే కలలే తరిమే ఓ మనసా
మనసా మనసా

ఓ మనసా ఓ మనసా 
చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా 
నిజమే కనవా నువ్వు

(Music)

Song: O Manasa O Manasa
Movie: Bhadra
Lyrics: Sirivennela Seetharama Sastry
Music: Devi Sri Prasad
Singer: Ravi Varma

Post a Comment

0 Comments

–>