- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
(Music)
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చెరువుందే
నీవే నా అతిశయం
ఆ గిరులు ఈ తరులు
ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం
ఓ..పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ...
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె
నీవే నా అతిశయం
(Music)
ఏ వాసన లేని కొమ్మలపై
సువాసన కలిగిన పూలున్నయ్
పూల వాసనతిశయమే
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో
ఒక చిటికెడైనా ఉప్పుందా
వాన నీరు అతిశయమే
విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా
వెలిగేటి మిణుగురులతిశయమే
తనువున ప్రాణం ఏ చోటనున్నదో
ప్రాణం లోన ప్రేమ ఏ చోటనున్నదో
ఆలోచిస్తే అతిశయమే
ఆ గిరులు ఈ తరులు
ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం ఓ..
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ..
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె
నీవే నా అతిశయం
(Music)
అల వెన్నెలంటి ఒక దీవి
ఇరు కాళ్ళంట నడిచొచ్చె
నీవే నా అతిశయము
జగమున అతిశయాలు ఏడైన
ఓ మాట్లడే పువ్వా నువు
ఎనిమిదొవ అతిశయము
నింగి లాంటి నీ కళ్ళు
పాలుగారే చెక్కిళ్ళు
తేనెలూరె అధరాలు అతిశయమూ
మగువ చేతి వేళ్ళు అతిశయమే
మకుటాలాంటి గోళ్ళు అతిశయమే
కదిలే ఒంపులు అతిశయమే
ఆ గిరులు ఈ తరులు
ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం
ఓ.. పదహారు ప్రాయాల పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అతిశయమే అచ్చరువొందె
నీవే నా అతిశయం
(Music)
Song: Puvvullo Dagunna
Movie: Jeans
Music: A.R. Rahman
Lyrics: Siva Ganesh
Singers: Sujatha, Unni Krishnan
Comments
Post a Comment