- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
(Music)
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
మనం అన్నది ఒకే మాటని
నాకిన్నాళ్లు తెలుసు
నువ్వు నేను ఇద్దరున్నామంటే
నమ్మనంటూ ఉంది మనసు
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
(Music)
ఈనాడే సరికొత్తగా
మొదలైందా మన జీవితం
గతమంటూ ఏం లేదని
చెరిగిందా ప్రతి జ్ఞాపకం
కనులు మూసుకుని ఏం లాభం
కలైపోదుగా ఏ సత్యం
ఎటూ తేల్చని నీ మౌనం
ఎటో తెలియని ప్రయాణం
ప్రతి క్షణం ఎదురయే
నన్నే దాటగలదా
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
(Music)
గాలిపటం గగనానిదా
ఎగరేసే ఈ నేలదా
నా హృదయం నీ చెలిమిదా
ముడివేసే ఇంకొకరిదా
నిన్నా మొన్నలనీ నిలువెల్ల
నిత్యం నిన్ను తడిమే వేళ
తడే దాచుకున్న మేఘంలా
ఆకాశాన నువ్వు ఎటు వున్నా
చినుకులా కరగక
శిలై ఉండగలవా
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
మనం అన్నది ఒకే మాటని
నాకిన్నాళ్లు తెలుసు
నువ్వు నేను ఇద్దరున్నామంటే
నమ్మనంటూ ఉంది మనసు
Song: Kallaloki Kallu petti
Movie: Nuvve Kavali
Singer: Chitra
Lyrics: Sirivennela Sitarama Sastry
Music: Koti
Director: K.Vijay Bhaskar
Cast: Tarun,Richa,Sai Kiran
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment