Featured Post

Aakasam Enatido Song Lyrics - Nireekshana


(Music)

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ

(Music)

ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీ
ఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీ
బంధాలై పెనవేయు వయసుకు
అందాలే దాసోహమనగా

మందారం విరబూయు పెదవులు
మధువులనే చవిచూడమనగా
పరువాలే... ప్రణయాలై...
స్వప్నాలే... స్వర్గాలై...

ఎన్నెన్నో శృంగార లీలలు
కన్నుల్లో రంగేళి అలదెను

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది

(Music)

ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
హృదయాలే తెరతీసి తనువుల
కలబోసీ మరపించమనగ

కౌగిలిలో చెరవేసి మదనుని
కరిగించీ గెలిపించమనగ
మోహాలే... దాహాలై...
సరసాలే... సరదాలై...

కాలాన్నే నిలవేసి కలలకు
ఇవ్వాలీ వెలలేని విలువలు

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది

Comments