Andamaina Vennelalona Song Lyrics - Assembly Rowdy



(Music)

అందమైన వెన్నెలలోన
అచ్చతెలుగు పడుచువలె
మల్లె పూల పందిరి లోకి
నడిచి రావే సరిగమలా

మనసు నిండా మరులు పండ
పసిడి పల్లకి ఎక్కాల
రాగాలే ఊగాల శివరంజనవ్వాల
గరిసదస గరిసదస గరిసదస

చల్లనైన వేకువలోన
సంకురాతిరి వెలుగువలె
ముద్దబంతి ముగ్గులలోకి
సాగిరారా మగసిరిలా

కనుల నిండా కలలు పండ
పూల పడవ నడపాలి
అందాలే చిందాలి అపరంజి నవ్వాలి
గరిసదస గరిసదస గరిసదస

అందమైన వెన్నెలలోన
అచ్చతెలుగు పడుచువలె
ముద్దబంతి ముగ్గులలోకి
సాగిరారా మగసిరిలా

(Music)

నురుగు తరగల గోదారై
వలపు మిల మిల మెరవాల
ఒంపుసొంపుల సెలయేరై
వయసు గల గల నవ్వాల

నురుగు తరగల గోదారై
వలపు మిల మిల మెరవాల
ఒంపుసొంపుల సెలయేరై
వయసు గల గల నవ్వాల

కొమ్మమీద కోకిలనై
కొత్తరాగం పలకాల
గుడికి నేను దీపమునై
కోటివెలుగులు కురియాల

కంటి పాపనై కాలి అందెనై
కంటి పాపనై కాలి అందెనై
కాలమంత కరగబోసి కాపు ఉండనా
సరిగా రిగప గపాద పదాస
గరిసదస గరిసదస గరిసదస

చల్లనైన వేకువలోన
సంకురాతిరి వెలుగువలె
మల్లె పూల పందిరి లోకి
నడిచి రావే సరిగమలా

(Music)

ఇంద్రధనుసు విరిసింది
ఏడడుగులు నడవాల
సందె చుక్క నిలిచింది
బుగ్గ చుక్క పెట్టాల 

ఇంద్రధనుసు విరిసింది
ఏడడుగులు నడవాల
సందె చుక్క నిలిచింది
బుగ్గ చుక్క పెట్టాల 

ఈడు జోడు ఎలుగెత్తి
ఏరువాక పాడాల
తోడు నీడ ఇరువురమై
గూటికందం తేవాల

తీగమల్లినై తేనె జల్లునై
తీగమల్లినై తేనె జల్లునై
కోరికంత కూడబెట్టి కొలువుసేయనా
సారిగా రిగాప గపాద పదాస
గరిసదస గరిసదస గరిసదస

అందమైన వెన్నెలలోన
అచ్చతెలుగు పడుచువలె
మల్లె పూల పందిరి లోకి
నడిచి రావే సరిగమలా

కనుల నిండా కలలు పండ
పూల పడవ నడపాలి
అందాలే చిందాలి అపరంజి నవ్వాలి
గరిసదస గరిసదస గరిసదస




Post a Comment

0 Comments

–>