- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్లలో రోజూ దీపావళి
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్లలో రోజూ దీపావళి
(Music)
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
చుట్టమల్లే కష్టమొస్తే
కళ్లనీళ్లు పెట్టుకుంటూ
కాళ్ళు కడిగి స్వాగతించకూ
ఒక్క చిన్న నవ్వు నవ్వి
సాగనంపకుండా
లేనిపోని సేవచేయకు
మిణుగురులా మిలమిల మెరిసే
దరహాసం చాలు కదా
ముసురుకునే నిశి విలవిలలాడుతూ
పరుగులు తియ్యదా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్లలో రోజూ దీపావళి
(Music)
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
నిన్న రాత్రి పీడకల
నేడు తలచుకుంటూ
నిద్రమానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైనా
అందులోనే ఉంటూ
లేవకుండా ఉండగలమా
కలలుగన్నవి కలలే అని
తెలిసినదే తెలివమ్మా
కలతలని నీ కిలకిలతో
తరిమెయ్యవే చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్లలో రోజూ దీపావళి
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా
Movie Name : Chirunavvuto
Banner : S.P.Entertainments
Producer : Venkat Shyam Prasad
Director : Ramprasad G
Music Director : Mani Sharma
Cast : Venu, Shaheen
Lyrics : Sirivennela Sitaramasastri
Singers : S. P. Balu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment