Diamond Rani Song Lyrics In Telugu - Kotha Kothaga


(Music)

వాలు కన్నుల్లో మాగ్నెట్టు దాగుందే
సూదిలా నన్ను గుంజేస్తాందే
హంస నడకల్లో ఏం మాయ దాగుందో
హింస పెట్టేసి లాగేస్తాందే

గుండెలో ఏదో గడియారం ముళ్ళుందే
రోజు నీ చుట్టు తిరిగేస్తాందే
నన్ను వదిలేసి నా నీడ
నీ రెడ్డు చున్నీ పట్టుకొని వేలాడిందే

పోకే.. నన్నొదిలి వెళ్ళిపోకే
నా మనసునే గిల్లిపోకే
నీ దారిలో పువ్వులే నేను జల్లానులే

నా డైమండు రాణివే
నీ బాయ్ ఫ్రెండు కానీవే
నువ్ ఓ ఛాన్సు ఇస్తే
పడగొట్టుకుంటూ లవ్ చేసుకుంటానే

నా డైమండు రాణి నువ్వే
నా గర్ల్ ఫ్రెండు అయిపోవే
పిల్ల నీ మాట ఇస్తే
నిలబెట్టుకుంటా నీతోటె ఉంటానే

(Music)

నీ చేతిలోని ఓ బుక్కునైతే
నా లైఫ్ ధన్యంలే
నీ వేళ్ళు తాకి ఓ రెక్కలొచ్చి
లోకాన్ని చుడతాలే

బైకుకున్న బ్యాకు సీటు నీకై
మైకు పట్టి పిలుస్తున్నదే
వీపునంటి నువ్వు కూర్చుంటే
గాల్లోన ఎగిరిపోతదే

రావేమే నా రాజే
నాతో పడరాదే నువ్ రాజే
నువ్ ఒప్పుకుంటే మన జంటకొస్తది
ఊళ్ళోన యమ క్రేజే

నా డైమండు రాణి నువ్వే
నీ బాయ్ ఫ్రెండు కానీవే
నువ్ ఓ ఛాన్సు ఇస్తే
పడగొట్టుకుంటూ లవ్ చేసుకుంటానే

(Music)

నీ నోట రాలే ముత్యాల కోసం
బెగ్గర్ ని అయ్యానే.. ఓ తల్లే
నీ నవ్వులోని రత్నాల కోసం
దొంగల్లె చూశానే

అంటరాని మనిషినేమి కాదే
అంత దూరం ఎందుకుంటవే
సెంటీమీటర్ ప్లేసు ఇచ్చి చూడే
అంటుకుంటే నిన్ను వదలనే

ఏవంటవే రాజే.. ఓ రాజే
నువ్ రాసెయ్యే లవ్ పేజే
నువ్ తలుసుకుంటే
ఏమంత కష్టం ఎగ్జామ్స్ కంటే ఈజీ

నా డైమండు రాణివే
నీ బాయ్ ఫ్రెండు కానీవే
నువ్ ఓ ఛాన్సు ఇస్తే
పడగొట్టుకుంటా లవ్ చేసుకుంటానే

Song: Diamond Rani
Movie: Kotha Kothaga
Lyrics: Kasarla Shyam
Singer: Anurag Kulkarni
Music: Sekhar Chandhra  





Post a Comment

0 Comments

–>