Ninne Ninne Song Lyrics In Telugu - Sashirekha Parinayam


(Music)

నిన్నే నిన్నే అల్లుకొని
కుసుమించే గంధం నేనవని
నన్నే నీలో కలుపుకొని
కొలువుంచే మంత్రం నీవవని

ప్రతి పూట పువ్వై పుడతా
నిన్నే చేరి మురిసేలా
ప్రతి అడుగు కోవెలనౌతా
నువ్వే నెలవు తీరేలా

నూరేళ్ళు నన్ను నీ నివేధనవని

నిన్నే నిన్నే అల్లుకొని
కుసుమించే గంధం నేనవని

(Music)

వెన్ను తట్టి మేలుకొలిపిన
వేకువ నువ్వే
కన్నె ఈడు నేను మరచిన
వేళవు నువ్వే

వేలు పట్టి వెంట నడిపిన
దారివి నువ్వే
తాళి కట్టి ఏల వలసిన
దొరవు నువ్వే

రమణి చెరను దాటించే
రామచంద్రుడా...
రాధ మదిని వేధించే
శ్యామ సుందరా...

మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట
పచ్చగ పండించరా...

నిన్నే నిన్నే అల్లుకొని
కుసుమించే గంధం నేనవని

(Music)

ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా
గంగ పొంగునాపకలిగిన కైలాశమా
కొంగు ముళ్ళలోన ఒదిగిన వైకుంఠమా

ప్రాయమంత కరిగించి
ధారపోయనా...
ఆయువంత వెలిగించి
హారతియ్యనా...

నిన్నే నిన్నే నిన్నే..

ఓ... నిన్నే నిన్నే నిన్నే..

(Music)

Song: Ninne Ninne
Movie: Sashirekha Parinayam
Music: Mani Sharma
Cast: Tarun, Genelia D'Souza
Lyrics: Sirivennela Sitarama Sastry
Singer: Chitra


Post a Comment

0 Comments

–>