Featured Post

Gundello Emundo Song Lyrics || Manmadhudu Movie || Nagarjuna, Sonali Bendre, Anshu


(Music)

గుండెల్లో ఏముందో
కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం
నీ పేరే పిలుస్తోంది

నిలవదు కద హృదయం
నువ్వు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం
నీ అలికిడి వినకుంటే

కలవరమో తొలి వరమో
తెలియని తరుణమిది

గుండెల్లో ఏముందో
కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం
నీ పేరే పిలుస్తోంది

మనసా మనసా
మనసా మనసా
మనసా మనసా
మనసా మనసా
ఓ మనసా

(Music)

పువ్వులో లేనిదీ
నీ నవ్వులో ఉన్నదీ
నువ్వు ఇపుడన్నదీ
నేనెప్పుడూ విననిదీ

నిన్నీలా చూసి పైనుంచి
వెన్నెలే చిన్నబోతుంది
కన్నులే దాటి కలలన్నీ
ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది

గుండెల్లో ఏముందో
కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం
నీ పేరే పిలుస్తోంది

(Music)

ఎందుకో తెలియనీ
కంగారు పుడుతున్నది
ఎక్కడా జరగనీ
వింతేమీ కాదే ఇది

పరిమళం వెంట పయనించే
పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాకా నడిపించే
పరిచయం తోడు కోరింది

దూరం తలొంచే
ముహూర్తం ఇంకెపుడోస్తుంది

గుండెల్లో ఏముందో
కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం
నీ పేరే పిలుస్తోంది

నిలవదు కద హృదయం
నువ్వు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం
నీ అలికిడి వినకుంటే

కలవరమో తొలి వరమో
తెలియని తరుణమిది

మనసా మనసా
మనసా మనసా
మనసా మనసా
మనసా మనసా
ఓ మనసా

(Music)

Song: Gundello Emundho
Movie: Manmadhudu
Banner: Annapoorna Studios
Director: K.Vijaya Bhaskar
Producer: Nagarjuna Akkineni
Music: Devi Sri Prasad
Artists: Nagarjuna, Sonali Bindre
Singers: Venu,Sumangali
Lyrics: Sirivennela Seetharama Sastry

Recently Added










Comments