Jagadanandakaraka Song Lyrics In Telugu - Sri Rama Rajyam


(Music)

జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా

జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా

జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

మంగళకరమౌ నీ రాక
ధర్మానికి వేదిక ఔగాక
మా జీవనమే ఇక పావనమౌగాకా

నీ పాలన శ్రీకరమౌగాక
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాకా

జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

(Music)

సార్వభౌమునిగ పూర్నకుంబములె
స్వాగతాలు పలికే
రాజ్యమేలమని ధర్మదేవతే
రాగమాల పాడే

నాల్గు వేదములు తన్మయత్వమున
జలధి మారు మ్రోగే
న్యాయ దేవతే శంకమూదగా
పూలవాన కురిసే

రాజమకుటమే ఒసగెలె
నవరత్న కాంతి నీరాజనం
సూర్యవంశ సింహాసనం
పులకించి చేసే అభివందనం

సామ్రాజ్య లక్ష్మియే
పాధ స్పర్షకి పరవశించి పొయే
 
జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

(Music)

రామ పాలనము కామధేనువని
వ్యోమసీమ చాటే
రామ శాసనము తిరుగులేనిదని
జలధి బోధ చేసే

రామ దర్శనం జన్మ ధన్యమని
రాయి కూడ తెలిపే
రామ రాజ్యమె పౌరులందరిని
నీతి బాట నిలిపే

రామ మంత్రమే తారకం
భహు శక్తి ముక్తి సందాయకం
రామ నామమే అమృతం
శ్రీ రామ కీర్తనం సుకృతం

ఈ రామచంద్రుడే లోకరక్షయని
అంతరాత్మ పలికే
 
జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

మంగళకరమౌ నీ రాక
ధర్మానికి వేదిక ఔగాక
మా జీవనమే ఇక పావనమౌగాకా

నీ పాలన శ్రీకరమౌగాక
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాకా
 
జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

Song: Jagadhanandhakaraka
Movie: Sri Rama Rajyam
Music: Ilayaraja
Cast: Bala Krishna, Nayantara
Lyrics: Jonnavitthula
Singers: S.P.Balasubramanyam, Shreya Ghoshal


Post a Comment

0 Comments

–>