Naa Kosam Song Lyrics In Telugu - Bangarraju


(Music)

కొత్తగా నాకేమయ్యిందో
వింతగా ఏదో మొదలయ్యిందో
అంతగా నాకర్ధం కాలేదే

మెరుపులా నీ చూపేముందో
చినుకులా నా పైవాలిందో
మనసిలా నీవైపే తిరిగిందే

ఇంకో ఆశ రెండో ధ్యాస
లేకుండ చేసావు
మాటల్లేని మంత్రం వేసి
మాయలోకి తోసావు

నా కోసం మారావా నువ్వు
లేక నన్నే మార్చేశావా నువ్వు
నా కోసం మారావా నువ్వు
లేక నన్నే మార్చేశావా నువ్వు

(Music)

ఓ నవ్వులే చల్లావు
పంచుకో మన్నవూ
తొలకరి చిరుజల్లు నువ్వు ఓ...

కళ్లకే దొరికావు
రంగులా మెరిసావు
నేలపై హరివిల్లా నువ్వు...

నిన్నా మొన్నల్లో
ఇల్లా లేనే లేనంటా
నీతోనే వుంటే ఇంకా ఇంకా బాగుంటా

మాటల్లోని మారాలన్ని
మంచులాగా మార్చావు

నీ కోసం మారానే నేను
నీతో నూరేల్లు ఉండేలా నేను
నీ కోసం మారానే నేను
నీతో నూరేల్లు ఉండేలా నేను

(Music)

ఓ మాటలే మరిచేలా
మౌనమే మిగిలేలా
మనసుతో పిలిచావా నన్ను

ఓ కన్నులే అడిగేలా
చూపులే అలిసేలా
ఎదురుగా నిలిపావా నిన్ను

పైకే నవ్వేలా లోకం అంతా నువ్వేలా
నాకే ఈవేళా నేనే నచ్చా నీవల్ల

మోమాటలే దూరం చేసె
మాట నీకు చెప్పేలా

ఓ నీవెంటే ఉంటున్నా నేనూ
నువ్వే లేకుంటే ఉంటానా నేనూ

నీవెంటే ఉంటున్నా నేనూ
నువ్వే లేకుంటే ఉంటానా నేనూ

(Music)

Song: Naa Kosam
Movie: Bangarraju
Singer: Sid Sriram
Music: Anup Rubens
Lyrics: Balaji




Post a Comment

0 Comments

–>