Em Jaruguthondi Song Lyrics In Telugu - Mahatma


(Music)

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
నా మనసుకివాళా
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది
నా వయసీవేళా

హే నీ ఎదట నిలిచే వరకూ 
ఆపదట తరిమే పరుగూ
ఏ పనట తమతో తనకూ తెలుసా హో..

నీ వెనక తిరిగే కనులూ
చూడవట వేరే కలలూ
ఏ మాయ చేసావసలూ సొగసా...

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
నా మనసుకివాళా
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది
నా వయసీవేళా

(Music)

పరాకులో పడిపోతుంటే
కన్నె వయసు కంగారూ
అరే అరే అంటూ
వచ్చీ తోడు నిలబడూ

పొత్తిళ్ళల్లో పసిపాపల్లే
పాతికేళ్ళ మగ ఈడూ
ఎక్కెక్కి ఏం కావాలందో
అడుగు అమ్మడూ

ఆకాసమే ఆపలేనీ చినుకు మాదిరీ
నీకోసమే దూకుతోందీ చిలిపి లాహిరీ
ఆవేశమే ఓపలేని వేడీ ఊపిరీ నీతో
సావసమే కోరుతోంది ఆదుకోమరీ

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
నా మనసుకివాళా
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది
నా వయసీవేళా

(Music)

ఉండుండిలా ఉబికొస్తుందేం
కమ్మనైన కన్నీరు
తీయనైన గుబులిది అంటే
నమ్మేదెవ్వరూ

మధురమైన కబురందిందే
కలత పడకు బంగారూ
పెదివితోటి చెక్కిలి నిమిరే
చెలిమి హాజరూ

గంగలాగ పొంగి రానా
ప్రేమ సంద్రమా
నీలో కరిగి అంతమవనా
ప్రాణ బంధమా

అంతులేని దాహమవనా 
ప్రియ ప్రవాహమా
నీతో కలిసి పూర్తి అవనా
మొదటి స్నేహమా

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
నా మనసుకివాళా
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది
నా వయసీవేళా

హే నీ ఎదట నిలిచే వరకూ
ఆపదట తరిమే పరుగూ
ఏ మాయ చేసావసలు సొగసా...

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
నా మనసుకివాళా
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది
నా వయసు ఇవేళా

Song: Em Jaruguthondi
Movie: Mahatma
Music: Vijay Antony
Singers: Karthik, Sangeetha
Lyrics: Sirivennela Sitarama Sastry Garu





Post a Comment

0 Comments

–>