Mari Antaga Song Lyrics - Seethamma Vakitlo Sirimalle Chettu



మరీ అంతగా మహా చింతగ
మొహం ముడుచుకొకల
పనేం తోచక పరేషానుగ
గడ బిడ పడకు అల

మతోయెంతగ శ్రుతే పెంచగ
విచారల విల విల
సరే చాలిక అలా జాలిగ
తిక మక పెడితే ఎలా

కన్నీరై  కురవాల
మన చుట్టు ఉండె లోకం తడిసేల
ముస్తాబె చెదరాల
నిను చూడాలంటె అద్దం జడిసేలా

ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా
కదా మరెందుకు గోల
అయ్యయ్యొ పాపం అంటె
ఎదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల

మరీ అంతగా మహా చింతగ
మొహం ముడుచుకోకలా
సరే చాలిక అల జాలిగ
తిక మక పెడితే ఎలా

(Music)

ఎండలను దండిస్తామ
వానలను నిందిస్తామ
చలినెటో తరిమెస్తామ చీ పొమ్మనీ 

కస్సుమని కలహిస్తామ
ఉస్సురని విలపిస్తామ
రోజులతొ రాజీ పడమ సర్లేమ్మననీ 

సాటి మనుషులతో మాత్రం
సాగనని ఎందుకు పంతం
పూటకొక పేచి పడుతు
ఎం సాధిస్తామంటే ఎం చెపుతాం

ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే
కష్టం పోతుందా కదా మరెందుకు గోల
అయ్యయ్యొ పాపం అంటె
ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల

(Music)

చమటలెం చిందించాల
శ్రమపడేం పండించాల
పెదవిపై చిగురించెల చిరునవ్వులు

కండలను కరిగించాల
కొండలను కదిలించాల
చచ్చి చెడి సాధించాల సుఖశాంతులు

మనుషులనిపించే రుజువు
మమతలను పెంచే ఋతువు 
మనసులను తెరిచే హితవు
వందేళ్ళయిన వాడని చిరునవ్వు

ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే
కష్టం పోతుందా
కదా మరెందుకు గోల

అయ్యయ్యొ పాపం అంటె
ఏదో లాభం వస్తుందా
వృధా ప్రయాస పడాల

(Music)

Song : Mari Antaga
Movie : Seethamma Vakitlo Sirimalle Chettu
Banner : Sri Venkateswara Creations
Producer : Dil Raju
Director : Srikanth Addala
Star Cast : Venkatesh, Mahesh Babu,Samantha,Anjali
Lyrics : Sirivennela Sitarama Sastry
Music : Mickey.J.Mayor
Singer : Sri Rama Chandra


Post a Comment

0 Comments

–>